నేస్తం
నేస్తం
చిరునవ్వుల దారాలను..తెంచుకోకు నేస్తం..!
అహంకారమను గొడుగే..పట్టుకోకు నేస్తం..!
చిన్నిచిట్టి పాపంటే..నీమనసే తెలుసా..
ఎవరిపట్ల కోపమింత..పెట్టుకోకు నేస్తం..!
విజయాలను నీసొంతం..చేసేందుకు ఉన్నా..
నీ పై నీ విశ్వాసము..వదులుకోకు నేస్తం..!
కాలానికి రెక్కలేవి..లేవుచూడు ఎగరగ..
నీ నీడను నీవెపుడూ..కసురుకోకు నేస్తం..!
కోపమెంత తుంటరిదో..వస్తుపోతు ఉండును..
కసితో నీ కృషిని పెంచు..తిట్టుకోకు నేస్తం..!
నిరంతరం పనిచేసే..శ్వాసింటనె దైవము..
ఒకసాక్షిగ మిగలటమే..తప్పుకోకు నేస్తం..!

