నేరమగునట
నేరమగునట
సత్యమేదో చెప్పవలెనని..తలచుకొనుటే నేరమగునట..!
నేనునేనుగ బ్రతుకవలెనని..కోరుకొనుటే నేరమగునట..!
శిక్షవేసే యముడుఎవరో..నిదురపోకే యుండునెట్లా..!?
స్వర్గమేదో ఉన్నచోటే..చూసుకొనుటే నేరమగునట..!
దైవమంటూ ఉన్నదెచటో..చూచినారా ఎవ్వరైనా..
విశ్వమంతా దైవమేనని..తెలుసుకొనుటే నేరమగునట..!
మౌననదిగా మనసుమారక..కవనవనమున చేరుటెట్లా..
సమాధులతో మాటలాడుట..నేర్చుకొనుటే నేరమగునట..!
విత్తనాలను చల్లినంతనె..క్షేత్రరాజము పండునెట్లా..
మేఘరంజని రాగమేదో..పాడుకొనుటే నేరమగునట..!
రాత్రిఒడిలో నిదురపట్టని..జాబిలమ్మకు బాధలెన్నో..
చెలుని ఎదపై చేరిమెల్లగ..చెప్పుకొనుటే నేరమగునట..!
