నేనెప్పుడూ
నేనెప్పుడూ
నేనెపుడూ మరి ఎంతో..ఖాళీగా ఉంటుంటా..!
వ్రాయబడని పద్యంలా..తాపీగా ఉంటుంటా..!
వేదించే మాటలతో..పేచీయే పడను సుమా..
చెలియందెల రవళులింట..బందీగా ఉంటుంటా..!
చెప్పడాని కేముండును..వెలుగుతేనె ఎక్కడిదట..
సఖిపగడపు రేకులింట..చమ్కీగా ఉంటుంటా..!
తమాషాల నాటకమిది..తాళాలకు లోటులేదు..
తనమాటకు తాళమేయు..మేస్త్రీగా ఉంటుంటా..!
కవితలెవరు వ్రాస్తేనేం..మధురిమనే ప్రేమిస్తా..
గజలాత్మను తట్టిలేపు..పాళీగా ఉంటుంటా..!
భగ్గుమనే నవ్వులేవొ..పండించే చూపులేల..
చెలిపలుకుల మౌనానికి..మిల్కీగా ఉంటుంటా..

