STORYMIRROR

Midhun babu

Romance Classics Fantasy

4  

Midhun babu

Romance Classics Fantasy

నడిరేయి

నడిరేయి

1 min
7


నడిరేయి సడిలేక..గుచ్చేవు కత్తులే..!

నా ప్రణయ వీధిలో..చిమ్మేవు నిప్పులే..!


ఆశలను బ్రతికించి..పోషించు చెలియవే.. 

అద్దాల మేడపై..పరచేవు సొగసులే..!


ఉన్నాను శిలలాగ..జీవించి నీ కొరకు..

విందంటు విరహాల..చిందేవు నవ్వులే..!


గుడిలోన మ్రోగేటి..గంటలా నా గుండె..

ప్రతిసంజె వేళలో..చెప్పేవు ఊసులే..!


కరువాయె నీజాడ..బరువాయెనే మనసు..

పరువాల నదినీవు..కోసేవు నరములే..!


హేమంత శిరాలు..మౌనమై పోవునా..

వాసంత గీతమై..ఏలేవు తలపులే..!



Rate this content
Log in

Similar telugu poem from Romance