STORYMIRROR

Praveena Monangi

Inspirational

4  

Praveena Monangi

Inspirational

నాన్న

నాన్న

1 min
352

అమ్మ అనే రెండక్షరాల కమ్మని పిలుపులో అనురాగము ఉంది,


నాన్న అనే రెండక్షరాల పిలుపులో నాది అనే అధికారం ఉంది ,


అప్పటివరకు అమ్మకే పరిమితమైన నాన్న ప్రేమ ,


నేను పుట్టగానే నా సొంతమయింది,


తన తల్లిని ,తన కూతురి లో చూసుకొని మురిసిపోయే ,అల్ప సంతోషి నాన్న,


బంధాలను,అనుబంధాలను సమతూకముగా నిలబెట్టే ప్రజ్ఞాశీలుడు నాన్న,


జన్మతహ నాన్న,విజ్ఞతహ గురువు,కౌమారతహ స్నేహితుడు ‘’నాన్న’’,


భార్య బిడ్డల కొరకు అలుపెరుగక అహర్నిసలు శ్రమిస్తారు నాన్న,


తన బిడ్డలకు గొప్ప ఆదర్శమూర్తి నాన్న,


కూతురు నాన్న లాంటి భర్తను కోరుకునేంత ఉన్నత భావాలు కల వ్యక్తి నాన్న,


నాన్న అనే పిలుపు తప్ప ఏమీ ఇవ్వలేని మాకోసం,


తన జీవితన్నే ధారపోసిన మహోన్నత వ్యక్తి నాన్న,


భగవద్గీతలో గీతోపదేశం అర్జునుడికి ఎటువంటిదో,


జీవితంలో అన్ని సమయాలలో ,అంతటి మహత్తరమైనవి నాన్న పలుకులు,


నాన్న రక్షణ,కర్ణుడి కవచకుండలాలు లాంటివి,


ఇవ్వడమే తప్ప ఏమి ఆశించని నిస్వార్దపరుడు నాన్న,


ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేని ఋణం ‘’నాన్న ప్రేమ ‘’.


ఈ కవిత అచ్చంగా తెలుగు అనే పత్రిక లో ప్రచురింపబడింది ,మార్చి 23,2016 సంచికలో



Rate this content
Log in

Similar telugu poem from Inspirational