నాన్న
నాన్న


పిలవడానికి రెండవ అక్షరం పదం నాన్న,
జన్మంతా నడిపించేంత నమ్మకం నాన్న,
ఏ భయమైనా దాటించేంత ధైర్యం నాన్న,
నన్ను పెంచి పెద్ద చేసింది నాన్న,
మంచి బాటలో నడిపించేవాడు నాన్న,
నీతికి నిజాయితీకి నిదర్శనం నాన్న,
జీవిత పాఠాలు నేర్పే మొదటి గురువు నాన్న,
సహనానికి మారుపేరు నాన్న,
మన కోసం కష్టపడుతూ
కుటుంబాన్ని నడిపించేవాడు నాన్న,
మన కష్టాలను కూడా తన కష్టంగా భావించే వాడే నాన్న,
మన గెలుపుని మురిసి పోయే వాడే నాన్న,
గొప్ప త్యాగాలు చేసే వాడే నాన్నా,
నాన్న అనే పదం
నాకు ధైర్యం
కమ్మనైన అనురాగం,
ఆయన తోడుంటే ఆనందమే నిత్యం,
ఆయన ఒక విశ్వరూపం,
జన్మనిచ్చిన నాన్నే నాకు బ్రహ్మ,
నన్ను పెంచిన నాన్నే నాకు రెండో అమ్మ,
ఆయన నాకు చూపించేను ఎనలేని ప్రేమ.