నా ప్రేమను
నా ప్రేమను
మాటలాడి నీమనస్సు..నొప్పించుట బాగుండదు..!
నాప్రేమను ఓ లేఖగ..వ్రాసిచ్చుట బాగుండదు..!
ఇంకెలాగ చెప్పగలను..గాలిలోని పాటగాక..
ఆవేదన ఎంతైనా..వివరించుట బాగుండదు..!
జన్మమెత్తి నానెందుకొ..పుణ్యమేమి చేసినానొ..
బాధలతో సౌఖ్యమెంతొ..మోసేయుట బాగుండదు..!
ఈ హృదయపు లావణ్యత..ఎంతంటే ఏంచెప్పను..
గులాబీల పానుపిపుడు..చుట్టేయుట బాగుండదు..!
చేయలేను హెచ్చరికలు..చెప్పలేను పాఠాలను..
బంధాలను తెంచేసుకు..వెళిపోవుట బాగుండదు..!
తప్పులెంచు పనియదేల..భాగస్వామి యర్థమేమి..
చెలిమివిలువ గుర్తించక..సాధించుట బాగుండదు..!

