STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

నా మట్టుకు

నా మట్టుకు

1 min
5


తెలుగులోన గజలేదో..తెలియలేదు నామట్టుకు..! 
గజల్ గుట్టు బుర్రకేమొ..ఎక్కలేదు నామట్టుకు..! 

జరుగుతున్న వాదనలను..తోసేస్తూ వ్రాసేస్తా.. 
పాఠం అది ఏదైనా..పట్టలేదు నామట్టుకు..! 

ఎవరిమాట వినవలెనట..ఎవరికెవరు గురువంటా.. 
నేర్చుకునే దేమిటంట..ఉండలేదు నామట్టుకు..! 

ఒక తుఫాను నియమాలను..పాటిస్తూ వస్తుందా.. 
ఈ బ్రతుకో గాలివాటు..గొడవలేదు నామట్టుకు..! 

మెట్లేవో దారులేవొ..వెతికేపని పెట్టుకోను.. 
లెక్కలేని తనమదేదొ..తప్పలేదు నామట్టుకు..! 

ఏ కోకిల ఎవరివద్ద..అభ్యసించె గానవిద్య.. 
దూకే ఒక వాగునేను..ఎఱుకలేదు నామట్టుకు..!


Rate this content
Log in

Similar telugu poem from Classics