STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama Tragedy

4  

Dinakar Reddy

Abstract Drama Tragedy

నా జన్మకు ఒక శాపం

నా జన్మకు ఒక శాపం

1 min
419

మళ్లీ వచ్చే కాళ్ళ పగుళ్ళలా

నీ స్పర్శ తిరిగి గుర్తొస్తోంది

ఎంత ప్రేమ ఉంది అందులో

అని ఇంకా నా మనసు అంటోంది

అలానే అనుకోవాలి

అలా అనుకోకపోయినా అలానే చెప్పాలి


అబ్బే

నువ్వు నన్ను మోసం చేశావ్

నన్ను వదిలేసి వెళ్ళిపోయావ్

ఇలా నేను నిజాలు మాట్లాడట్లేదు

ఎందుకంటే అలా మాట్లాడితే 

జనం నాది పిచ్చని పక్కకి నెట్టేస్తారు


రెండు సెకన్ల పనికి ప్రేమ అని పేరు పెట్టి

నా మెదడును చిధ్రం చేసే జ్ఞాపకాల జైలులో

నన్ను అపరాధ భావపు లోకంలో వదిలి

వెళ్లిపోయిన నీకు ఒక నమస్కారం


నీ పరిచయం ఇప్పుడు పెనుభారం

నీతో గడిపిన ప్రతి క్షణం

నా జన్మకు ఒక శాపం

చూద్దాం

కవిత్వమే నాకు శాప విమోచన మార్గమో ఏమో



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract