నా హృదయక్షరాలు!
నా హృదయక్షరాలు!
నా హృదయాక్షరాలు నీకు కనిపించాలని..
మనసును తడిపి మౌనంగా రాస్తున్న
నా ప్రేమ భావనలు...
నేనంటూ లేని లోకం నాది
నాకంటూ లేని కలలు నావి
నా ప్రాణం నువ్వే అయి పోయాక
నే చూసే ప్రతీ చోట నువ్వే
నే తలచే ప్రతీ తలపు నీదే...
నీవు లేక బతికేదెలా నిరుపేదలా
నిముషం అయినా గడిచేదెలా నిశిధిలా
మరణంతో అయినా పోరాడుతానేమో..
కానీ నీ మౌనాన్ని భరించలేకపోతున్నాను.
మరుపన్నదే లేదే మనసుకు.
నిదురన్నదే రాదే కనులకు,
అలుపన్నదే ఉండేదే ఆలోచనలకు..
మన్నించు ప్రియా...
మాటల బాణాలు వేస్తున్నాని అనిపిస్తే...
శ్రీ...
హృదయ స్పందన

