STORYMIRROR

Dinakar Reddy

Abstract Inspirational

4  

Dinakar Reddy

Abstract Inspirational

నా దేశం

నా దేశం

1 min
267

నా దేశం భారత దేశం

ఆర్యావర్తం నా దేశం 

అంటూ చిన్నప్పుడు పాడిన పాట

పదే పదే గుర్తుకు వస్తోంది


నా దేశం అన్నపూర్ణ

కానీ ఆకలి చావుల వార్తలు ఇంకా చదువుతున్నా

నా దేశం కర్మభూమి

కానీ కర్మ చేసేందుకే ఇష్టం లేని యువతను చూస్తున్నా


ఎన్నో విషయాల్లో వెనుకబడ్డాం

మరెన్నో విషయాల్లో ముందుకు ఉరికాం

ఇవే చర్చలు


సరే

పిల్లలకు ఏం నేర్పిస్తున్నాం

సమాజ హితం లేదు

దేశ క్షేమం లేదు

ఏదో ఒకటి చేసెయ్యమని ప్రోత్సహిస్తున్నారు


సరే అంతా బానే ఉంది

మరి నేరాలు జరిగినప్పుడు బాధ్యత ఎవరిది

ఎవ్వరూ తీసుకోరు

సురక్షితమైన సమాజం ఎలా సాధ్యం


నా దేశం అని గర్వంగా చెప్పుకునేటప్పుడు

ఆ దేశ అభివృద్ధి కోసం

నువ్వేం చేస్తున్నావ్ అనేది కూడా ఒకసారి ఆలోచించు


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract