నా భావనలో...
నా భావనలో...


అక్షరమాల నాకు
అక్షరాల మాల అనిపించదు...
అమ్మ తొలిసారి తాపించిన
చనుబాలమధురిమ...
చిట్టిగుటలేసిన అనుభూతి...
పదాలపూలతో
వాక్యాలదండలల్లుకుని
పేజీల ప్రాంగణంలో
పరుగులెడుతూ
పద్యాల హరివిల్లులో
కావ్యాల పొదరిళ్ళు
పొదువుకుని
సాహితీప్రాంగణంలో
భాషావాహినియై
ప్రవహిస్తున్నప్పుడు
తెలుగుతల్లి బిడ్డగా
జన్మసార్ధక్యం...
మాతృభాషాపరిరక్షణకై
నా జీవనం నైవేద్యం...!!!
*****