STORYMIRROR

Praveena Monangi

Children

4  

Praveena Monangi

Children

నా బాల్యంలో

నా బాల్యంలో

1 min
294


కల్లాకపటం ఈర్ష్యాద్వేషాలు వంటి  

ఆస్తులు లేని పేదరాలుని

బాధ్యతలు బరువులు లేని స్వేచ్ఛా జీవిని

పరిమితులు లేని కలల ఆశాజీవిని

ఉల్లాసానికి ఉత్సాహానికి చిరునామాని

స్వచ్ఛమైన స్నేహానికి పునాదిని

తల్లిదండ్రుల సాంగత్య పరిష్వంగనలో

అలుపెరుగని యువరాణిని

ముద్దుల మూటలు గౌనుకి చుట్టుకుని

చెంగుచెంగున ఎగురుతూ

ఆటపాటలలో తేలియాడుతూ

అనంతమైన ఆనందాన్ని ఆస్వాదించిన

అపురూపమైన బాల్యం నాది.


Rate this content
Log in

Similar telugu poem from Children