నా బాధను
నా బాధను
నీవుగాక ఇంకెవ్వరు..తీర్చగలరు నా బాధను..!
స్వరములలో నింపలేను..అంతులేని నీ ప్రేమను..!
మాటలెంత తుంటరివో..మౌనములో చేరేనవి..
చెప్పలేను వ్రాయలేను..ఇవ్వలేను ఓ లేఖను..!
చూపులతో వర్షించగ..చేయు యత్నమేం చాలదు..
సాహసమే చేయలేను..ఇంతైనా కనులెత్తను..!
తెలవారగ ఇష్టపడని..రేయికన్న తోడెవరిక..
చిత్రముగా జారిపోవు..కరుగుకలను చూడగను..!
అలజడితో గొడవపడే..రెప్పలింటి కాపురమే..
విరహామృత గీతముగా..మార్చినదే తనూలతను..!
మనసుపడే యాతననే..మలచాలా కావ్యముగా..
కట్టడేల చేయాలోయ్..ప్రశ్నించే పరువాలను..!
