STORYMIRROR

శ్రీలత.కొట్టె "హృదయ స్పందన "

Abstract Classics Inspirational

4  

శ్రీలత.కొట్టె "హృదయ స్పందన "

Abstract Classics Inspirational

నా అక్షరాలు!

నా అక్షరాలు!

1 min
305


నా అక్షరాలు రాధమాధవ ప్రణయగీతాలు,

నా అక్షరాలు ఆకాశం లోని నక్షత్రాలు,

నా అక్షరాలు ఇంద్రధనస్సులోని రంగులు,

నా అక్షరాలు పచ్చికబయళ్లపై ఆడుకునే

బంగారు వర్ణపు మంచుతుంపరలు,

నా అక్షరాలు రంగురంగుల సీతాకోకలు,

నా అక్షరాలు నయాగరా జలపాతాలు,

నా అక్షరాలు పసిపాప నవ్వులోని శబ్దతరంగాలు,

నా అక్షరాలు నిశ్శబ్దపు నిశీధిలో సాగరగోషలు,

నా అక్షరాలు నా ఆలోచనల ఆకృతులు,

నా అక్షరాలు నా మదిభావాల పరిమళాలు,

నా అక్షరాలు నూతన శకానికి నాంది వాక్యాలు..

నా అక్షరాల ఆయువుతో...

కవిగా...

కవితగా..

కథగా...

వస్తున్నాను...

బహుదూరపు బాటసారినై..

జీవన గమ్యాన్ని ఛేదించాలని.


శ్రీ...

హృదయ స్పందన 


Rate this content
Log in

Similar telugu poem from Abstract