ముందు -విందు
ముందు -విందు
కలియుగం కలియుగం
ప్రియమైన కోర్కెలదే ఈయుగం,
మందే హృదయమై పాడుతుంది నిషాగీతం.
కొమ్మనున్న దోరపండుకన్నా కోకిలమ్మకు మందే ప్రియం,
బిడియంలేని వాకిలే పలికింది స్వాగతం,
పాడుకున్న పాటల్లో మెదిలింది నవరాగం,
దప్పికతీర్చే సెలయేరుకన్నా మందే అయ్యింది అమృతం.
గువ్వపిట్ట గుబులు తెలిసి చెలిమిచేసి చేరదీసే మానవమృగం,
వెర్రితలపుల మత్తుకు అహుతాయే జీవం,
మోహించే కోర్కెల రుచులే దుఃఖదేహపు కూపం,
హితకరమౌ సత్యభోధనం గ్రహిస్తే
నిత్యం సంతోష సంబరం.
