STORYMIRROR

శ్రీలత.కొట్టె "హృదయ స్పందన "

Tragedy Classics

4  

శ్రీలత.కొట్టె "హృదయ స్పందన "

Tragedy Classics

మట్టినైపోతాను

మట్టినైపోతాను

1 min
307


నేను మౌనమైన విషాద గీతికను,

హృదయాగ్నిలో కాలిన బూడిదను.


నేను కరిగిన కన్నీటి ఆనవాలును,

మిగిలిన జ్ఞాపకాల నీడను.


నా విషాద గాథ వినిపించేదేవరికి,

నా హృదయ బాధ కనిపించేదెవరికి


ఏ దేవుని పాదాలను సృశిస్తుంది 

ఏ మనిషి హృదయాన్ని కరిగిస్తుంది..


నేనున్నా ఈ లోకంలో ఒంటరిగా...

వెళ్తున్న మోయలేని భారంతో...


మనిషినై వచ్చాను...

మట్టినై పోతాను...


శ్రీలత ..

హృదయ స్పందన..



Rate this content
Log in

Similar telugu poem from Tragedy