Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

శ్రీనివాస్ మంత్రిప్రగడ

Abstract Classics Others

4  

శ్రీనివాస్ మంత్రిప్రగడ

Abstract Classics Others

మరోసారి కూనలమ్మ 1

మరోసారి కూనలమ్మ 1

1 min
362


ఆత్మగత ప్రేమలు 

నిరర్ధక విద్వేషాలు 

మనసులో మర్మాలు 

ఓ కూనలమ్మ 


వెనక చూపుల కరణ  

పాశ్చాత్య అనుకరణ 

తొలగించు మన కరుణ 

ఓ కూనలమ్మ 


రోత శిక్షల కన్నా 

రాద్ధాంతముల కన్నా 

బాల శిక్షణే మిన్న 

ఓ కూనలమ్మ 


సున్నితత్వపు కైంకర్యం

కలలోని కైవల్యం 

అంతర్జాల ద్యూతం 

ఓ కూనలమ్మ 


పాత కాదొక రోత

భవిత కాదొక జేత

వర్తమానమే జోత

ఓ కూనలమ్మ


Rate this content
Log in

Similar telugu poem from Abstract