STORYMIRROR

# Suryakiran #

Thriller

3  

# Suryakiran #

Thriller

మరోలోకపు అలజడి !

మరోలోకపు అలజడి !

1 min
152


వస్తున్నా , నేడే నేను నేనై వచ్చేస్తున్నా ,

రాకెట్వేగంతో నన్ను నీ దరికి చేర్చేస్తున్నా !

మా లోకానికి అతిథిగా నిను తెస్తున్నా ,

స్నేహవారధిని ఎలియన్నై నిర్మించేస్తున్నా !


ఇంద్రుడా , చంద్రుడా మీ రాజ్యానికి అధిపతి ?

మాకైతే దేశానికో ఎన్నుకోబడే పతి ,

ఇప్పుడు ఓ స్త్రీరత్నము మా రాష్ట్రపతి .

ఐనా , యు ఎస్ అధ్యక్షుడిదే ఎవరెప్పుడు

పిలిచినా ఔదార్యాన్ని చాటే మతి .


నీ ఆహ్వానాన్ని ఓ ఫ్లైయింగ్ సాసర్ తెచ్చిందోచ్ ,

నాలో ఆశ్చర్యం నాటినుంచి హెచ్చిందోచ్ !

ముందుగా నీ రూపం కలలోకొచ్చి ,

ప్రేమను తెలిపిందోచ్ , మైమరపించిందోచ్ !


నీకోసం ఓ మధురాతిమధురమైన కవితను

రాయి రాయంటుంది నా వయసు .

తన విన్నపాన్ని మన్నించకపోతే ,

రాయైపోదా నీ అపురూపమైన మనసు !


నిన్ను చేరేదాకా నాలో చెప్పలేని అలజడి ,

ఆరనిది విశ్వమంతా ప్రేమికుల గుండెతడి .

ఆగనివే ఎదురుచూపులూ , నా జోడి !

కట్టేద్దామా ఒకరికొకరం గుడి , ఒడిలో బడి !




Rate this content
Log in

Similar telugu poem from Thriller