STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama Thriller

4  

Dinakar Reddy

Abstract Drama Thriller

అపరిచితుడు

అపరిచితుడు

1 min
232

నలుగురిలో ఉన్నా

ఒంటరిని నేనంటూ

సంభాషణలకు దూరం అవుతూ 

తనలో తాను ఆనందం పొందుతూ


ఒక పూల తోట

ఓ చల్లని చెట్టు నీడ

ఒక గుడి మండపం

ఓ పాత సినిమా

ఇవి చాలు

రోజు గడిచిపోతుంది

రోజూ గడిచిపోతుంది


మనుషులంటే పడి చచ్చే నేను

ఇంతలా మారానా

నాకు నేను కొత్తగా

అపరిచితుడిలా

ప్రకృతి ప్రేమికుడిగా

మారానా


ఇది నిజమేనా

ఏమో

ఇది బాగుంది

జీవితం అంటే కష్టం సుఖం 

అన్నీ చూడాలి అంటారు

మరి ప్రకృతిని జీవితంలో భాగం ఎందుకు చేసుకోరు..


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract