STORYMIRROR

SATYA PAVAN GANDHAM

Abstract Classics Others

4  

SATYA PAVAN GANDHAM

Abstract Classics Others

"మనసులో మాట..!"

"మనసులో మాట..!"

1 min
295

తెరిచిన నా కనులకు మాత్రమే తెలుసు..

నీ రూపము ఎంత ముఖ్యమో!


పలికిన నా పెదవులకు మాత్రమే తెలుసు..

నీ పిలుపు ఎంత ముఖ్యమో!


అరిగిన నా పాదాలకు మాత్రమే తెలుసు..

నీ తోడు ఎంత ముఖ్యమో!


అలసిన నా దేహానికి మాత్రమే తెలుసు...

నీ కౌగిలి ఎంత ముఖ్యమో!


నిలిచిన నా ప్రాణానికి మాత్రమే తెలుసు..

నీ ఊపిరి ఎంత ముఖ్యమో!


విరిగిన నా మనసుకి మాత్రమే తెలుసు..

నీ ప్రేమ ఎంత ముఖ్యమో!

అది మరెంత మధురమో!!


ఇన్నాళ్లు నీ కోసం నిరంతరం పరితపించిన నా పిచ్చి మనసు పాపం, 

ఇన్నాళ్ళకి నిన్ను చూసిన ఈ క్షణాన్న ఎందుకు వహిస్తుందో మరి మౌనం?


నా ఇష్ట సఖివైన నిన్ను, కష్టమైనా పొందడంలో నేను చాలానే నష్ట పోయానని నీకు తెలపాలనున్నది.

అందుకే, నాలోని నీపైన పొంగిపొర్లుతున్న ఈ ప్రేమ భావం, 

కనీసం, నా ఈ అక్షరాలా రూపంలో నీకందిస్తూ వర్ణించగలుగుతున్నా...


అది నీ చెంతకు చేరదని తెలిసినా...

నా ఈ ప్రయత్నం ఆగదుగా చెలియా!

నా మనసు మారదుగా సఖియా!!

ఫలించేనా నా ఈ నిరీక్షణ!!!


ఇట్లు,

నీకై తపించే 

ఓ ప్రేమ పిపాసి


-సత్య పవన్


Finally a break ...

It has been passing two long years , since I last saw you.

And it's not just a matter of years, bcoz every single moment is passing like an age.



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract