మనసుకన్న
మనసుకన్న
బాధించే నిప్పులేదు..వేదించే మనసుకన్న..!
ఊరించే తోడులేదు..స్వప్నించే మనసుకన్న..!
పారిపోవు ఆలోచన..ఫలితమెంత దారుణమో..
నొప్పించే ముల్లులేదు..కలహించే మనసుకన్న..!
వెంటాడే ప్రియుడెవరో..తెలియలేని తనమెందుకు..
రక్షించే మతములేదు..ప్రేమించే మనసుకన్న..!
నూనెలేని దీపంలా..వెలుగుతున్న ఆశ ఏల..
మంత్రించే ముద్దులేదు..మోహించే మనసుకన్న..!
మూడునాళ్ళ నాటకమున..ఏ పాత్రను ఎంతసేపొ..
చిగురించే గుణములేదు..సాధించే మనసుకన్న..!

