STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama

4  

Dinakar Reddy

Abstract Drama

మనసుది మౌన పోరాటం

మనసుది మౌన పోరాటం

1 min
327

తాపం కాదది స్వేద ప్రవాహం

మరుగున పడిన ప్రేమల దాహం

తడి ఆరని కన్నులు చేసే పుష్ప విలాపం

మనసు పడిన వారి కోసం చేసే మౌన పోరాటం


ఆశలు ఆశయాలు వదులుకుంటుంది

అవమానాలు తట్టుకుంటుంది

తనవారి క్షేమం కోసం లక్ష్యాల్ని మార్చుకుంటుంది

అర్థం చేసుకునే వారి కోసం పరితపిస్తుంది


ఎందుకింత ప్రేమ మనసా

ఉదయాన్నే సరుకులు తెచ్చేయాలని

ఇంటి అద్దె అడగక ముందే కట్టేయాలని 

కాస్త అయినా పొదుపు ఉండాలని


విశ్రాంతి తీసుకోకుండా 

విసుగు అని అనుకోకుండా

కళ్లద్దాల వెనుక కన్నీళ్లను రానివ్వకుండా

ముందడుగు వేస్తున్న ప్రతి మనిషికీ 

ఇది నా సలాం


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract