మనసు కదా
మనసు కదా
చెలి మనసుతొ సంభాషణ..జరపటమే కదా..!
తన చూపుల ప్రేమలేఖ..అవ్వటమే మనసు కదా..!
ఈ విరహపు ఆవేదన..పంచుకొందు కెవరుందురు..
తన ఒంటరి తనమేదో..తీర్చటమే మనసు కదా..!
శిల్పమయే రాయికూడ..కన్నీటికి బానిసయే..
చెక్కబడేటపుడు ఉగ్గబట్టటమే మనసు కదా..!
ప్రవహించే నదిమనస్సు..తెలిసినదొక గగనమేను..
కాలుతున్న మట్టిగుండె..తడపటమే మనసు కదా..!
అందమైన దేమున్నది..చెలి ఊహల మెఱుపుకన్న..
మహరాజై తన కౌగిట..నలగటమే మనసు కదా..!

