STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

మనసు కాలిన వాసన

మనసు కాలిన వాసన

1 min
0


శరీరానికి తగిలిన గాయం 
మందుతో కొంత ఉపశమనం,
మరి కంటికి కానరాక మనసుకు తగిలిన
గాయం ఏ అంతులేని నిశబ్దాన్ని 
ఆవరించేనోగా!

మమతలు పంచిన హృదయం
 పెనవేసుకున్న బంధాలన్నీ ఒక్కొక్కటిగా
 స్వార్థాల బాట పట్టాక ఊపిరి సలపని 
మనసు లోలోన దావాగ్నిలా రగులుతూ 
కాలిన వాసనలా గుప్పుమంటుంది

ఇది జీవితం! అప్పుడప్పుడూ గాయాలు 
తగులుతుంటాయి బంధాలు;
మసక బారినంతనే మరవలేము,
దాయలేము ,వదలలేము;
ఓటమిని తట్టుకుని దుఃఖ లిపితో 
భావాలు అల్లుకుంటూనే సాగాలి
జ్ఞాపకాలు ఎదను మీటినప్పుడల్లా కలలో
సైతం కన్నీరు పెట్టిస్తాయి,
నమ్మకాన్ని కోల్పోయిన మనసంతా 
శూన్యమై ఆవరిస్తునే వుంటుంది 


Rate this content
Log in

Similar telugu poem from Classics