STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

మనసే మనిషికి బంధిఖాన

మనసే మనిషికి బంధిఖాన

1 min
10



మనిషి జీవితమే తాత్విక బంధిఖాన 
బతుక్కు కావల్సింది మనసే ఓ ఖజానా 
బంధాల్లో బంధీ చేసే మనసు నజరానా 
మనసులేని మనిషి మ్రాను లాగా నిశాన 

మనసే మనిషి మనుగడకు మార్గదర్శి 
తదనుగుణంగా జీవితం ఒక కార్యదర్శి 
మనసు కనిపించని స్వేచ్ఛా విహంగం 
ఓ వాయువేగంతో విహరించే తతంగం 

మనసు కోరికలకు మనిషి దాసోహం 
సుఖ సంతోషాలకై నిత్యం ఆరాటం
వాటి సాధనలో బందీగా తన పోరాటం 
కనపడని గోడలతో కమ్మిన మనోగతం 

ఆలోచనలే కట్టిపడేసే ఇనుపకడ్డీలు
ఆవేదనలే నిలువెళ్ళా మనో సంకెళ్లు 
చేదు జ్ఞాపకాలే ఓ మరువలేని శిక్షలు
రేపటి భయాలతో గడవని గడ్డు రోజులు 

ప్రేమలు, ఆప్యాయతలు మనో నేస్తాలు 
వాటిలో చిక్కుకొని విలవిలలాడే మనసులు 
డబ్బు, అధికారం, స్థాయి, హోదాల మోజులు
మానసిక ఆనందానికై అర్రులు చాచే రోజులు 

అలవాట్లు, పొరపాట్లు, వెరసి సౌఖ్యాలు 
భౌతిక, మానసిక తృప్తి కోసం అగచాట్లు 
వున్నన్నాళ్ళు అనుభవించాలనే ఏర్పాట్లు
మనిషికి మనసిచ్చే రకరకాల సిగపట్లు 

మనిషి వెళ్ళే చోటుకు మనసు పోతే బాధ
మనసు పోయే చోట మనిషికి తప్పని వ్యథ
మనసు, మనిషి విడిపోలేని ఒక బంధం 
ఆ బంధంతో మనసే మనిషికి బంధిఖాన !!


Rate this content
Log in

Similar telugu poem from Classics