మనసా
మనసా
నిన్ను చూడాలనే ఆశ చిగురించిన ప్రతిసారీ
కనుచూపు మేరలో నువ్వులేవని తెలిసినా
నీ గొంతు వినాలనే కోరిక కలిగినప్పుడు సైతం
అందని తీరాలలో నువ్వున్నావని వగచినా
ఏదో ఒక రోజు నీ ఒడిలోనే కన్ను మూస్తాననే
నమ్మకంతోనే జీవిస్తున్నా
ఈ వరమొక్కటీ ప్రసాదించు ప్రియతమా

