STORYMIRROR

Dinakar Reddy

Abstract Romance

4  

Dinakar Reddy

Abstract Romance

మన్మథ బాణం

మన్మథ బాణం

1 min
310

మది మొత్తం గులాబీల పరిమళం

ఆమె మాటలు పంచదార పాకం

సొగసులు స్వర్గలోకపు ఉద్యానవనం

మెలికలు పద్యగద్యాల శృంగారధనం


కురుల అందం పడి లేచే కడలి తరంగం

పెదవుల బింకం సీతాకోకచిలుక రెక్కల కొత్తదనం

నయనముల హర్షం మురిపించే శ్రావణ మేఘం

పరవశింపజేయి జూకాల శబ్దం


కోటికోటి వైడూర్య కాంతుల వస్త్రం

తుమ్మెద ఝుంకారాల అంగీకార పత్రం

నడకలు రుతుపవనాగమన వేళ మయూర నాట్యం

ముక్కెర వెలుగుల పసన్న వదనం


వెన్నెల రాత్రుల రసాస్వాదనలో

చూపులు కలిసిన వైనం

ఆమె రతీ దేవి సాక్షాత్కారం

ఆతడు మన్మథ బాణములు సంధింప

ఆమె తెలిపెను వలపుల అంగీకారం


Rate this content
Log in

Similar telugu poem from Abstract