" మల్లెల మనసు "
" మల్లెల మనసు "
మల్లెల మనసు " - RK
మబ్బురాత్రి వేళకి
మంచులోలికే గాలికి
మత్తెక్కించే ఆలుకి
ఆలు మెడలో తాళికి
పిచ్చెక్కించే మల్లెలు
పొలంలోని ఇంటి మేడమీదా
మనసైన నులక మంచంమీదా
మంచమంచుకి కూర్చొన్న
పడుచుపిల్లా తలమీదా
పరవశిస్తున్నా మల్లెలమనసు
ఏంటో అర్థంకాకాపాయే కదా
జొన్నకంకుల లేతగాలులు
తుమ్మచెట్టుమీది తూనీగలు
జోలపాడి నిద్రపుచ్చగా
మల్లెలొచ్చి నిద్రలేపాయి కదా
పడచు అందాల నడుమ
రాత్రంతా నిద్రలేకుండా చేశాయి కదా
అయినా మల్లెలకెందుకింత మత్తు,
చివరికీ నా వొళ్ళంతా అయ్యింది చిత్తు
పడచు సంయోగాల సమరంలో
గెలిచిందెవరో , ఓడిందెవరో
మల్లెలమనసుకే తెలుసు
ఆలు అదిరిపోయే అందగత్తే అయినా
మల్లెలు లేకపోతే నా గతేo కాను?
అలవాటైన మనసుకి ఏం సమాధానం చెప్పాలి
పెళ్ళై ఐదేళ్లు గడిచినా ఆలు అర్థమైంది కానీ
మల్లెల మనసు అర్థమే కాకపాయే కదా
నలిగినా, నలిపినా అలగకుండా
నిస్వార్థంగా సువాసల్ని పడకమీదా
చల్లిచనిపోవడమే కావచ్చు వాటి ధ్యేయం
✍️✍️✍️RK