Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

SATYA PAVAN GANDHAM

Inspirational

4  

SATYA PAVAN GANDHAM

Inspirational

"మజిలీ"

"మజిలీ"

1 min
206


నాదే ... నాదే... 

కష్టం నాదే, ఇష్టం లేదే, 

దుఃఖం నాదే, మోధం లేదే, 

ద్వేషం నాదే, ప్రేమం లేదే, 

సహనం నాదే, స్వార్థం లేదే, 

నాదే.. నాదే.. లేనిది కూడా నాదే, కానీ ఏది కాదే శాశ్వతమే !


నాదే ... నాదే... 

బంధం నాదే, అందం లేదే, 

పంతం నాదే, బలగం లేదే, 

కోపం నాదే, శాంతం లేదే, 

విరహం నాదే, సరసం లేదే, 

నాదే.. నాదే.. లేనిది కూడా నాదే, కానీ ఏది కాదే శాశ్వతమే !


నాదే ... నాదే... 

మోతా నాదే, బరువూ లేదే, 

రోతా నాదే, అరుపూ లేదే, 

గమనం నాదే, గమ్యం లేదే, 

దూరం నాదే, తీరం లేదే, 

నాదే.. నాదే.. లేనిది కూడా నాదే, కానీ ఏది కాదే శాశ్వతమే !


నాదే ... నాదే... 

మంచి నాదే, ముసుగు లేదే, 

చీకటి నాదే, వెన్నెల లేదే, 

బాధ్యత నాదే, భయం లేదే, 

కర్మం నాదే, మర్మం లేదే, 

నాదే.. నాదే.. లేనిది కూడా నాదే, కానీ ఏది కాదే శాశ్వతమే !


నాదే ... నాదే... 

విద్యా నాదే, వృత్తి లేదే, 

కళా నాదే, కలా లేదే, 

కవిత్వం నాదే, కలం లేదే, 

జీవితం నాదే, కాలం లేదే, 

నాదే.. నాదే.. లేనిది కూడా నాదే, కానీ ఏది కాదే శాశ్వతమే !

                      

                          -✍️సత్య పవన్✍️

  



Rate this content
Log in

Similar telugu poem from Inspirational