మిత్రమా
మిత్రమా
మనసునే కుదుపుతూ ఎదలోన ఎగసిపడు భావాలు తెలుపనా..
క్షోభనే పెంచుతూ గుండెనే పిండేటి కథనాలు రాయనా..
ఎన్నేళ్ళ వైరమో..ఎందుకీ ద్వేషమో..తెలియలేకుందిలే...
అలజడిని రేపుతూ ...ఆవేదనను పెంచు వచనాలు చూపనా..
మౌనంగ మనలేను...మాట జారనులేను ..జడమునసలే(జడపదార్థం) కాను...
దుఃఖాన్ని తొలిగించి చైతన్యమును పంచు గీతాలు పాడనా...
ఏజన్మ పుణ్యమో..పదమునై చేరాను.. వాక్యముగ మారాను..
అమరమై సాగుతూ చరితలో స్థిరమయ్యె కావ్యాలు కూర్చనా..
సుఖదుఃఖములు చూపు బ్రతుకంటె భయమేల సాగిపో మిత్రమా...
వెతలన్ని ఎడబాపి సౌఖ్యాన్ని కొనితెచ్చు స్వప్నాలు చెప్పనా..

