STORYMIRROR

Bhagya sree

Drama

3  

Bhagya sree

Drama

మీ ప్రేమికులం

మీ ప్రేమికులం

1 min
402


మిమ్మల్ని ఈ భూమ్మీదకు తెస్తాం కళ్లల్లో పెట్టుకొని పెంచుతాం

అయినా

మేము ఏమీ తెలియని వాళ్ళం, మేము మీ అమ్మలం

అనంతమైన అనురాగాన్ని అందిస్తాం

అయినా

మీ గుండెకు గుదిబండ అవుతాం, మేము మీ కూతుళ్ళం

సర్వం అర్పిస్తాం సకల సేవలుచేస్తాం వారసత్వాన్ని కొనసాగిస్తాం

అయినా 

ఏమీ తెలియని వెర్రి మొహాలం, మీ భార్యలం

ఇంటెడు చాకిరీ చేస్తాం,పిల్లల్ని సాకుతాం హోం వర్క్ లు చేయిస్తాం

అయినా సాయంత్రానికి ఇంట్లో ఖాళీయేగా ఏం పని అని అనిపించుకుంటాం, మీ గృహిణులం

పనులు నెత్తిన వేసుకొని చకచకా చేసేస్తాం

అయినా

లైంగిక వేధింపులు జరిగినప్పుడు చెప్పాలా లేదా పెదవి విప్పాలా లేదా అని సంశయిస్తుంటాం

మేము ఉద్యోగినులం

ఊరి నుద్ధరిస్తాం

అయినా

వచ్చిన కోడల్ని కాస్తో కూస్తో వేధిస్తాం,మేము గడసరి అత్త లం

సోషల్ మీడియాలో లో మంచి మాటలకు లైకులు పెడతాం

అయినా

అత్తలు చెప్పే బంగారు మాటలను పెడచెవిన పెడదాం మేము హైటెక్ కోడళ్ళం

మీతో పుట్టి పెరుగుతాం మిమ్మల్ని ఎప్పుడూ ప్రేమిస్తాం

అయినా

మీ ఆస్తి పంపకాన మా ప్రమేయం లేకుండా మేం అనుమానింపబడతాం, మేం తోబుట్టువులం, మీ ఇంటి ఆడపడుచులం

మా బిడ్డలు విదేశాలకు తీసుకెళ్లడానికి మాదేతొలి ప్రాధాన్యం మేమే డైపర్ విశాలం

ప్పుడు

మేము అమ్మమ్మలం, నాన్నమ్మలం

కొప్పు కొప్పు కలవదు అంటూనే రోజు రెండు టీ కప్పులతో మాట్లాడుకుంటుంటాం

అప్పుడు

మేం పక్కింటి అమ్మలక్కలం

కనిపించని సంకెళ్ళు ఎవరే సారో తెలియక

ఎవరినెమనాలో అర్థం కాక

ఎన్నో సాధించాలని

సమయం సరిపోక , చాలక

సాయం అందక అవి సాధించలేక 

పొద్దు పోక మాలో మాకే ఎన్నెన్నో కీచులాటలు

అవి

మా మానసిక సంఘర్షణకి ఆటవిడుపులు

అప్పుడప్పుడూ మేలుకొలుపులు

మా సరదాల పొద్ధుపొడుపులు

వెరసి మేం ఆడవాళ్ళం

మీ వంశ పరువు ప్రతిష్ట కు సరిహద్దు లేని సైనికులం

మీకు మీ పిల్లలకు జీతం బత్తెం లేని సేవకులం

మీ ఇంటికి కళ తెచ్చే సంసార సమిధులం

సమయం అంతా మీ కిచ్చి పదేపదే మీరు మమ్మల్ని పట్టించుకుంటారని ని అర్థం చేసుకుంటారని తపన పడే

మీ ప్రేమికులం

                                                                



Rate this content
Log in