మిగిలిపోదా
మిగిలిపోదా
విరహవేదన కానుకిస్తే..బతుకుతీపే మిగిలిపోదా..!
నీవుకొంచెం కనికరిస్తే..వెర్రియాశే ఇగిరిపోదా..!
ఎన్నిజన్మలు ఎత్తినానో..నిన్నుచేరే దారిలోనే..
వింతమోహం జరిగిపోతే..వలపుగంధం రాలిపోదా..!
శ్వాసశ్వాసకు ప్రాణదీపం..సాక్షిలాగా మారెనేమో..
ఎదురుచూపే తోడుకాగా..గుండెసడియే నిలిచిపోదా..!
చూపజాలని చిత్రమేదో..జరుగుచున్నది తలపువాకిట..
వ్రాయబడని కావ్యమల్లే..మనసునీకే చిక్కిపోదా..!
మబ్బులేవో మెఱుపులేవో..మాయచేసే గారడీలో..
వానవిల్లే చెలియతానై..సత్యమేదో చాటిపోదా..!
వసంతానికి సెలవునిచ్చే..విద్యయేదో నేర్వనైతిని..
నీవువెచ్చగ నవ్వినావో..పున్నమట్లా ఉండిపోదా..!
