STORYMIRROR

Venkata Rama Seshu Nandagiri

Inspirational

4  

Venkata Rama Seshu Nandagiri

Inspirational

మహమ్మారి కరోనా

మహమ్మారి కరోనా

1 min
208

వణికిస్తున్నది మహమ్మారి కరోనా ప్రపంచమంతా

అయినా తమ వంతు కృషి చేస్తున్నారు వైద్యులంతా

వైద్యులకు సహాయకారులైన ఆసుపత్రి సిబ్బంది

చూసుకునే నర్సులు, రోగులకు కలగనీయక ఇబ్బంది

అప్రమత్తం చేసేందుకు ప్రజలను, పోలీసులు

సమయానికి మందులిచ్చేందుకు మందులషాపులు

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచే పారిశుద్ధ్యకార్మికులు

పిలవగానే అప్రమత్తులై వచ్చే అంబులెన్స్ డ్రైవర్లు

ప్రజల ఆరోగ్య పరిరక్షణకై పాటుపడే యంత్రాంగం

ఇన్నిరకాలుగా పాట్లుపడుతున్నా లేదే ఏ ఉపయోగం!

కారణం, ప్రజలు స్వీయరక్షణను పాటించకపోవడం

స్వచ్ఛంద నిర్బంధాన్ని కొనసాగించక పోవడం

మాస్కులు, శానిటైజర్లను తేలికగా తీసుకోవడం

ప్రజలు నిర్బంధం పాటించక చేస్తుంటే స్వేచ్ఛా విహారం

కరోనా మరి చేయదా ప్రజలపై అంకుశంతో ప్రహారం!

ఇప్పటికైనా కనులు తెరవాలి ప్రభుత్వాలు, ప్రజలు

జాగ్రత్తలు పాటించని వారిపై తీసుకోవాలి కఠిన చర్యలు


Rate this content
Log in

Similar telugu poem from Inspirational