STORYMIRROR

Challa Sri Gouri

Abstract Inspirational Others

4  

Challa Sri Gouri

Abstract Inspirational Others

మహారాణి- ఔన్నత్యానికి నిదర్శనం

మహారాణి- ఔన్నత్యానికి నిదర్శనం

1 min
273

పలుకుల్లోని తీయదనం

చూపుల్లోని మకరందం

చేతల్లోని ఔచిత్యం

ఆప్యాయతానురాగాల సమ్మేళనం

సౌందర్యానికి నిదర్శనం

గొప్పతనం ఆమె ఇంటి పేరు

ఆలోచన శైలిలో ఆమె తీరే వేరు

పొగడ్తలకు పొంగని గుణం

కష్టాలకు కు౦గని ధైర్యం

పతికి నీడై నడిచేను ప్రతిక్షణం

రాజ్యానికి పంచెను తల్లి మమత

అయ్యెను తన భర్త పాలిట పూలత

సంతోషాల హరివిల్లుకు సృష్టికర్త

అందుకే అయ్యింది మా దేవత


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract