మగాళ్ళు - ప్రమాణాలు
మగాళ్ళు - ప్రమాణాలు
ఇలానే ఉండాలి
ఏడ్పు వచ్చినా ఏడవకూడడు
కళ్ళల్లో బాధ కనిపించకూడదు
దారిలో వెళ్ళే ప్రతీ అమ్మాయినీ
ఏదో ఒకటి అనాలి
అలా అనకపోతే ధైర్యం లేనట్టే
ఇష్టమున్నా లేకున్నా
ఒక్క బూతైనా మాట్లాడాలి
ధైర్యం చూపించడానికి
ఎంతైనా డబ్బులు ఖర్చు పెట్టాలి
తర్వాత
ఇబ్బందులకు అప్పులు
అప్పులు తీర్చుకునే తప్పులు
అనుమానాలు
జల్సాల పేరు మీద
తప్పని తిరుగుళ్ళు
ఇలానే ఉండాలి
అని కొంతమందంటారు
బాధ్యతలు తెలిశాక
బతుకంటే ఏదో అర్థమయ్యాక
ఆలోచనలు వద్దన్నా మారతాయి
ప్రవర్తనను మార్చేస్తాయి
ప్రమాణాల కోసం జీవితాన్ని
బలి చేసుకుని
నిన్ను నువ్వు కోల్పోవడం కన్నా
పరిస్థి
తులతో పోరాటం చేయడం మంచిదిగా..
