STORYMIRROR

Ramesh Babu Kommineni

Inspirational

4  

Ramesh Babu Kommineni

Inspirational

మెరుపు తునకలు(హైకూలు)2

మెరుపు తునకలు(హైకూలు)2

1 min
456

అలుపెరగదు

గాలి నేస్తమున్నంతవరకు

కాలం విలువ తెలియదు

వృద్దాప్యం వచ్చేంతవరకు


చేదు జ్ఞాపకాలు చిరకాలం

ఆపరేషన్ కత్తి పెట్టిన గాటులా

ఒకటి మనసును పట్టి ఉంచేది

వేరొకటి దేహానికి సంభందించింది


యవ్వనం వయసు వీచిక

బ్రతుకు గమ్యం చేరుకోలేని పాచిక

అడక్కుండా పెరిగేది వయసు

తెలియకుండా తరిగేది ఆయస్సు


ఆశలు అనంతం

సమస్యలూ అనంతం

మొదటివి తీరుతాయని ఎదురుచూపులు

రెండోవి పోతాయని ఎరుగని నిట్టూర్పులు


సముద్రానికి ఎంత నీరు చేరినా పొంగి పొరలదు

ధనవంతుడికి ఎంత సంపాదించినా దాహం తీరదు

వేసవిలో వర్షంలా

వేటకై తారట్లాడే పులిలా


నరికే వాడిక్కూడ నీడనిస్తుంది చెట్టు

పైకి నడిచేవాడికి ఊతమిస్తుంది మెట్టు

మొదటిది విశాలత్వం

రెండవది ఆలంబనా తత్వం



Rate this content
Log in

Similar telugu poem from Inspirational