STORYMIRROR

Anjani Gayathri

Inspirational Others

4  

Anjani Gayathri

Inspirational Others

🌹 మేఘమా!మరువకే!🌹

🌹 మేఘమా!మరువకే!🌹

1 min
328

🌹మేఘమా మరువకే!!( కవిత)🌹

   రచన :-అంజనీగాయత్రి


 ఎండాకాలపు వడగాల్పుల నుండి,

 ఉపశమనం పొందాలని నీకైతపించే,


మా ఆశలు ఆవిరవక ముందే

నీవు,ఉరుమువై గర్జించు,

మెరుపువై కాంతులీనుతూ,


ఆవిరిలా ఆకాశానికి కమ్ముకున్న

 నీ మబ్బులలో దాగివున్న

 జలనిధిని చిరుజల్లులై

 నేలను తాకేలా,


 ముత్యపు చినుకులై వర్షించు,

 ఓ మేఘమా మరువకే!!

 వర్షించే నీ చినుకులలో తడవనీమమ్ము ,

మేఘమా మరువకే!!


 రైతన్న ముంగిట కలల పంటగా,

 ధాన్యపురాశులు, కొలువయ్యేలా,

 నీ చిరుచినుకుల చిత్తడినికురిపించు,  ఓమేఘమామరువకే !!


Rate this content
Log in

Similar telugu poem from Inspirational