మధ్యతరగతి జీవితాలు
మధ్యతరగతి జీవితాలు
ఎన్నెన్నో ఆశలు,
అవన్నీ ఆకాశాన్నే చూస్తూ
దూసుకుంటూ పోతున్నాయి,
పక్షుల్లా
బతుకులేమో రెక్కలు తెగిన పక్షుల్లా
నేలమీదినుండి పైకి కూడా లేచి నిలబడలేకపోతున్నాయి,
మధ్యతరగతి బ్రతుకులు మరి...
కష్టపడినా చేతికి అందిన అవకాశాలు
అందినట్లే అంది చేజారిపోతున్నాయి,
అటు పేదవారిలాగా ఉండలేక
ఇటు ధనికుల్లా విలాసంగా జీవించలేక,
సమస్యలతో కొట్టుమిట్టాడుతూ,
మబ్బులు పట్టిన సూర్యునిలా,
వెలుగుల్లేని జీవితాలు వెళ్ళదీస్తున్నారు వారు
చిన్న చిన్న ఆశలు
తీరని కోర్కెలుగా మిగిలిపోతూ ఉంటే,
మంచిగా జీవించాలని
సంతోషంగా రోజులు గడపాలని
చేసే ప్రయత్నంలో నిత్యం విఫలమైపోతూ
ఇదే తమ జీవితామని నిరుత్సాహంతో
మబ్బులు కమ్మిన తమ బ్రతుకుల్ని తలచుకుంటూ
నిరుత్సాహంగా రోజులు వెళ్ళదీస్తున్నారు.
