STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

మౌనానికి గాయం

మౌనానికి గాయం

1 min
6


మాటను గాలికి వదిలితివో..మౌనానికి గాయం..! 
స్వార్థంలో మునిగితివో..త్యాగానికి గాయం..! 

చెలిమనసును నొప్పిస్తే..నరకమేర బహుమతి.. 
విచ్చలవిడి తిరిగితివో..పరువానికి గాయం..! 

సరిగమలను పలికేందుకు..వెతకదోయి కోకిల.. 
స్వరస్థానం మరచితివో..రాగానికి గాయం..! 

నేలపదును చేసుకునే..దిగవలెనోయ్ నాటుకు.. 
ఆరుద్రను తప్పితివో..సస్యానికి గాయం..! 

మంచీ-చెడు భావనలే..మారేనోయ్ అటుఇటు.. 
సత్యం తెలియక ఎగిరితివో..మరణానికి గాయం..! 

సముద్రమేం తీర్చగలదు..తన అలజడి తనదే.. 
పుడమిగుండె చీల్చితివో..శూన్యానికి గాయం..! 



Rate this content
Log in

Similar telugu poem from Classics