STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama

4  

Dinakar Reddy

Abstract Drama

మైనపు బొమ్మ

మైనపు బొమ్మ

1 min
297

మందారాల తోటలో ముద్దు ముద్దుగా

మనసులోని మాటల్ని వ్రాశాను తీయతీయగా

అప్పుడెప్పుడో నీ గురించి వ్రాశాను

మళ్లీ ఇన్నాళ్లకు నిన్ను చూశాను


కళ్ళ కింద నల్లటి వలయాలు

తడి ఆరిన పెదవులు

జీవం లేని మందహాసం

ఇదేనా నీ రూపం

కాదు కదా


అద్దాల మేడలో ఆరోజు నీ వైభవం

ఇవాళ ఏమైంది

కరుణ నిండిన కళ్ళలో దైన్యం

కోమలమైన చేతుల్లో కాఠిన్యం


మధుర స్వరం వణుకుతోంది

వయసు నిన్ను దాటి ఎప్పుడో వెళ్ళిపోయింది

అదిగో తోకచుక్క కింద పడుతోంది

ఇప్పుడైనా కోరుకో

మైనపు బొమ్మలాంటి జీవితం వద్దని

ఎండకూ వానకూ కరిగిపోకూడదనీ


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract