STORYMIRROR

Dinakar Reddy

Drama Action

4  

Dinakar Reddy

Drama Action

మాటలెందుకు.. మాయలెందుకు..

మాటలెందుకు.. మాయలెందుకు..

1 min
412

నచ్చలేదని

ఇష్టం లేదని

భరించానని

సంవత్సరం తర్వాత చెప్పడం ఎందుకు


ముందే చెప్పడం

పాత కాలం ఫ్యాషన్ కాదు

అవతలి వ్యక్తి సమయాన్ని గౌరవించడం

మల్లె తీగలా అల్లుకుని

మంటల్లో పడాలని

నాకేం గొప్ప కోరికల్లేవే


కళ్ళలో కలవరం దాచి

మనసులో నిన్ను తలచి

కుళ్లి కుళ్లి ఏడ్వాలని

అమర ప్రేమ ఇదని

లోకానికి చాటి చెప్పాలని

నాకస్సలు ఇష్టం లేదు


ఏదో జరిగింది

పోతే పోయింది

ఫుల్ బిందాస్ గా పాడుతూ

ఆడుతూ

నా జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నా


ఒకటే ప్రశ్న

నీకే కాదు

నీలా ఇష్టమని చెప్పి

సాహచర్యాన్ని ఆస్వాదించి

తర్వాత మనసు విరగ్గొట్టి పోయే వాళ్ళందరికీ

ఇదే ప్రశ్న


అన్ని మాటలెందుకు

మాయలెందుకు

ఉన్నదంతా మాయే కదా

మరీ పాకులాట ఎందుకు..



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Drama