మార్గదర్శి
మార్గదర్శి
అందమైన పూల వనం లో ఒక ఆనందాల సిరిమల్లి
స్వార్ధానికి అర్థం తెలియని ప్రేమానురాగాల పొదరిల్లు తాను
నమ్మకం, ప్రేమ అనే అస్త్రాలతో నన్ను ఉత్తమ స్థానానికి చేర్చిన దేవత
నా ప్రతీ కష్టాన్ని పంచుకున్న నేస్తం
నా ప్రతి అడుగులో అండగా నిలిచిన మార్గదర్శి
ఎప్పుడూ చేయూతను అందించే ఒక గొప్ప తోడు
ప్రతి క్షణం నా ఎదుగుదల కై శ్రమించిన శ్రామికురాలు
నా అవమానాలకు అడ్డుగోడగా నిలిచిన రక్షకురాలు
నా తప్పులను ఖండించిన శిక్షకు రాలు
ఈ దేవత పరిచయం వల్ల అయ్యింది నా జన్మ ధన్యం
అందుకే ఆవిడ లేని క్షణం నాకు శూన్యం
