మానసం
మానసం


ప౹౹
ఎదలోన పండినా ఎలమి ఎదురేగి పిలవాలి
మదిలోన ఆ కలిమి మహనీయమై కలవాలి ౹2౹
చ౹౹
కలిసిన మనసులు కలలోను స్వాగతించాలి
తెలిసిన వలపు తెగువతో అనుమతించాలి ౹2౹
కమనీయమే ఆ కనులలో నిండిన పరవశమే
ప్రేమహయమే హద్దులనూ చెరపే లేక వశమే ౹ప౹
చ౹౹
చెక్కిలి గిల్లునే చేరి యోచనలే హృదయంలో
చక్కలిగిలి అల్లునే తనువే అయోమయంలో ౹2౹
తీరాలి ముసిమికి తీరైన కలయిక ముచ్చట
కోరాలి ఆ జంట పల్లవించాలని ప్రేమలచ్చట ౹ప౹
చ౹౹
జాబిల్లి వెన్నెల జాలువారే జాగే తొలగించనే
శోభిల్లి ఎడద శోధించినే గోమునే పూరించనే ౹2౹
నేర్పించిన రొండొకటవునే నెమ్మితో నెమ్మదిగ
అర్పించిన మానసమే అంకితమవు చిన్నదిగ ౹ప౹