STORYMIRROR

Rajagopalan V.T

Tragedy

4  

Rajagopalan V.T

Tragedy

మా ఊరు

మా ఊరు

1 min
24.2K

నట్టేట ముంచినా

నది ఒడ్డుకు చేర్చినా

నావ నడిపే నీవే 

మా ఇల వేలుపు లే అమ్మా.. 


నీరాహారాలు చాలక 

ఎంత దూరం ఈ నడక 

కాలు నొస్తుందే అక్క 

నిద్ర కూడ కరువక్క... 


ఊరు దాకా పోయినాము 

ఉత్త చేతులతో మేము 

పిల్లలను పెద్దలను 

చూసేకేమో గడువులంట.. 


మా చిట్టి తల్లి నవ్వు 

చూడలేక పోయినామె 

కనులు మూసి తెరిచేమే 

కష్టాలు కనబడక పోయే.. 


గడువులేమో పూర్తి ఆయే 

ఇంటికి పంపించిరాయె 

చేతికి సంచిచ్చిరాయె 

పిల్లల మనసు పొంగిపోయే.. 


ఎన్ని కష్టాలొచ్చినా సరే 

గంజి తాగి బతుకుదాము 

బతుకు తెరువు కోసమని 

ఊరు విడిచి పెట్టము మేం...


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Tragedy