లక్ష్మణరేఖ - రక్షణకే సఖా!
లక్ష్మణరేఖ - రక్షణకే సఖా!


( కంద పద్యం )
వూహాన్ మొదలుగ జనములు
హాహాకారములు సేసిరాందో ళితులై
ఆహా! కట్టడి సేయగ
వ్యూహమ్ములు పన్నరే! మహోగ్ర! కరోనా!
( ఉత్పలమాల పద్యం )
సూక్ష్మ కరోనజీవి తనుశుద్ధత చేతను తా నశించు బో!
లక్ష్మి యటన్న స్వాస్థ్యమగు,' లక్ష్య సుసాధన కోరి నే డిటుల్
లక్ష్మణ రేఖ గీసె సకల ప్రజకున్ గృహబంధనస్థితిన్
సూక్ష్మమునందు మోక్షమును జూపె ప్రధాని నరేంద్రమోదిజీ