STORYMIRROR

ARJUNAIAH NARRA

Romance Fantasy Thriller

4  

ARJUNAIAH NARRA

Romance Fantasy Thriller

లివర్-లవర్

లివర్-లవర్

1 min
521

చేతిలో సిగరేట్టు

గుప్పు గుప్పున పొగను ఉదుతూ

ఒక్కోసారి ఒక్కో బ్రాండును పీల్చుతూ

ఊపిరితిత్తుల నిండా నింపుతూ

నా మనసును తగలబెట్టుకుంటున్న

ఇందులో తప్పేముందన్నా!


ఊపిరితిత్తులు తగలబడని, 

కాలనియ్యి, మాడి మసై

బూడిద అవ్వనియ్యి 

ఈ ఆరడుగుల కాయం ఎలాగూ

చివరికి కాలి బుడిదగా మిగలాల్సిందేగా!


ఓహో! ఆరోగ్యం జాగ్రత్త! అంటావా?

క్యాన్సర్ దేముందన్నా మందులున్నాయి

దగ్గుతూ కొన్నాలైన బతకొచ్చు

కానీ మనసు కాలిపోతుంటే

మందులెమీ పనిచేస్తాయన్నా!


చేతిలో మందు గ్లాస్

జుప్పు జుప్పున పెగ్గు తాగుతూ

ఒక్కోసారి ఒక్కో బ్రాండు మార్చుతూ

నాలుకకి రుచి, మెదడుకు మత్తు ఇస్తూ

నా మనసును తగలబెట్టుకుంటున్న

ఇందులో తప్పేముందన్నా!


కాలేయం చెడిపోని

కమిలిపోని,కుమలిపోనీ, 

చివరకు కుళ్లి కుళ్లి పోనియ్యి

ఈ ఆరడుగుల కాయం ఎలాగూ

చివరికి కాలి బుడిదగా మిగలాల్సిందేగా!


ఓహో! ఆరోగ్యం జాగ్రత్త! అంటావా?

లివర్ పాడైయిపోయినా బాధలేదన్నో!

దగ్గుతూ కొన్నాలైన బతకవచ్చు 

కానీ లవర్ పాడైపోయిందన్నో!

మనసు దహిస్తుంటే మందులెమీ పనిచేస్తాయన్నా!


నేను సిగరెట్ మార్చుతుంటే

ఆమె సిటీని మారుస్తుంది

నేను పొగను వదిలినట్లుగా 

నన్ను పొమ్మంది....

నేను బ్రాండును మార్చుతున్నట్లు

ఆవిడ లవర్ని మార్చుతుందన్నో!


నాది ఎన్నో పెగ్గొ నాకే తెలియదు!

ఆవిడకి, నేను ఎన్నో వాడినో 

ఆమెకి లెక్కే తెలియదు


అందుకే! ఈ సారి 

ఆరోగ్యం జాగ్రత్త! అంటావా?

కాదు సుమీ, మనసు జాగ్రత్త!

పొగను పీల్చవద్దు!

మందును తాగవద్దు!!

మనసును పాడుచేసే

మగువ వెంట పడవద్దు!!!

సో సోలోగా ఆలోచిస్తే (సోలో )

బ్యాచులర్ బతుకే బెటరన్నా!


Rate this content
Log in

Similar telugu poem from Romance