లెక్కల బుక్కు
లెక్కల బుక్కు
లెక్కల బుక్కు
(బాల గేయం )
లెక్కలంటే భయమే బామ్మా!
ఎక్కాలిప్పుడు రాలేదమ్మా!
వాచకమంటే వణుకేనమ్మా!
టీచరు దెబ్బలు వేస్తుందమ్మా!
గట్టిగ పలుకు! కంగారెందుకు?
పట్టుదల చూపు!పదరా ముందుకు!
బుద్దిమంతుడవు!బుర్రపెట్టుము!
సద్దును చేయకు!చదువుచుండుము!
రెండూ రెండూ అయిదన్నా!
మూడు నాలుగు పది యన్నా!
నాలుగో ఎక్కము రాలేదన్నా!
బాలుడ నేను భయపడుతున్నా!
వెంకట్రామా లెక్కల బుక్కును
సంకట మొందక చదివిన వచ్చును
ధైర్యము నొందుచు దారిని వెదుకు!
కార్యశూరుడవు!కదులు ముందుకు!//
