STORYMIRROR

Dr.R.N.SHEELA KUMAR

Children

4  

Dr.R.N.SHEELA KUMAR

Children

లేత. మనసు

లేత. మనసు

1 min
1.4K

సంతోషం ఇచ్చే చిన్నారులం

ముద్దులోలికే చిన్నారులం

ఆటల్లో అసాధ్యులం

అలుపే తెలియని పిల్లలం

        బస్సని, కారని ఆడేస్తాం

        గోళీలు, బొంగరాలు

       కోతి కొమ్మచ్చులు

       నాలుగు స్తంభాలటలు

      కరెంటు షాకులు, నేలాబండలు

     జీవితమే ఆనందం

    అమ్మ చేతి ముద్దలు

    నాన్న తెచ్చే మిఠాయిలు

     ఇవే మాకు సరదాలు, సంతోషం

     ఇచ్చే విషయాలు

    రాజా రాణి, దొంగ పోలీస్

   అష్టచమ్మ, పులి మేక

ఆటలు అన్ని ఇన్ని కావు

ఇక ఇప్పుడో ఎప్పుడు చుసిన

పుస్తకాలు, అది చదువు

ఇది చదువు, ఇది అది నేర్చుకో

అనే సూక్తులు

విని విని బోరు కొట్టె

మా లేత మనసులు

  సంతోషం ఇచ్చే చిన్నారులం

ముద్దులోలికే ముద్దు బిడ్డలం

భారత దేశం గర్వించే వారసులం

లేత మనసులున్న చిన్నారులం



Rate this content
Log in

Similar telugu poem from Children