STORYMIRROR

Midhun babu

Romance Classics Fantasy

4  

Midhun babu

Romance Classics Fantasy

కవ్విస్తూ

కవ్విస్తూ

1 min
7



ఎంతబాగ నవ్వుతావొ..మెఱుపులనే కవ్విస్తూ..! 
హృదిలోపల ప్రేమపదులు..చెలిమిమీర ఊరిస్తూ..!

పదేపదే పంపుతావు..వసంతాన్ని నాకోసం.. 
ఆకాశపు వీధులలో..మోహినియై నర్తిస్తూ..! 

స్వరములేడు మేళవించి..విందులెన్ని చేసేవో.. 
వేళకాని వేళలేక..వెలుగుతేనె వర్షిస్తూ..! 

పదములలో నింపలేని..పావనకర 'జాహ్నవి'గా.. 
గంధసుధా వాహినియై..గమకాలను పండిస్తూ..! 

అచ్చెరువే కానుకగా..అనుక్షణం ఈ మనసుకు.. 
కలలవీణ తంత్రులింట..కావ్యాలను సృష్టిస్తూ..! 

మౌనాక్షర శిల్పాలకు..మహిమాన్విత చందనమే.. 
కరుణామృత 'మల్హరి'యై..ప్రాణాలను పోషిస్తూ..! 


Rate this content
Log in

Similar telugu poem from Romance